Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏంటీ తొక్కలో గేమ్‌లు?.. 'బిగ్‌బాస్‌'పై పునర్నవి ఫైర్!

  • సెన్స్ ఉన్న టాస్క్‌లు ఇవ్వండి
  • ముష్టి టాస్క్‌లు పెట్టి.. ఆ తర్వాత రద్దు చేయొద్దు
  • రేపు చెడ్డీలు ఉతకాలా?: మహేశ్ విట్టా
తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొన్న పునర్నవి బిగ్‌బాస్‌పై తీవ్ర విమర్శలతో చెలరేగింది. తొక్కలో గేమ్‌లంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్డం వచ్చిన వస్తువులను కాలితో తంతూ ఆవేశంతో విరుచుకుపడింది. టాస్క్‌లు అందరికీ ఒకేలా ఉండాలని, ఇలాంటి పిచ్చిపిచ్చి టాస్క్‌లు వద్దంటూ మండిపడింది. ‘ఇంట్లో దెయ్యం నాకేంటి భయం’ టాస్క్‌లో భాగంగా పునర్నవి ఇలా అసహనం వ్యక్తం చేసింది. ఎప్పుడూ నువ్వే రైట్ అనుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి ముష్టి టాస్క్‌లు పెట్టి తర్వాత ఇష్టం వచ్చినట్టు రద్దు చేయడం ఏంటని ప్రశ్నించింది. కొంచెం సెన్స్ ఉన్న టాస్క్‌లు ఇవ్వాలని కోరింది. తన రియాక్షన్ కనుక తప్పయితే బయటకు వెళ్లిపోతానని నిక్కచ్చిగా చెప్పేసింది. ఇలాంటి సిల్లీ గేమ్స్ ఇస్తే కాలుతుందని పేర్కొంది.      

కాగా, దెయ్యం టాస్క్‌లో చెత్త పెర్ఫార్మెన్స్‌కు గాను పునర్నవికి బిగ్‌బాస్ షూ పాలిష్ శిక్ష విధించాడు. దీనిపైనా పునర్నవి మండిపడింది. షూ పాలిష్ చేసేది లేదని, కావాలంటే బయటకు పంపేయొచ్చని బిగ్‌బాస్‌కు చెప్పింది. తానిక్కడికి వచ్చింది షూ పాలిష్ చేయడానికి కాదని కుండబద్దలుగొట్టింది. శిక్ష విధించే ముందు తానేం తప్పు చేశానో చెప్పాలని ప్రశ్నించింది.

మరోవైపు, మహేశ్ విట్టా కూడా బిగ్‌బాస్‌పై ఫైరయ్యాడు. ‘చెప్పులు తుడవాలా? చెడ్డీలేం ఉతకొద్దా?’ అని ప్రశ్నించాడు. చెప్పులు కడిగేంత చీప్‌గా కనిపిస్తున్నానా? అని ప్రశ్నించాడు. పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా? అని విరుచుకుపడ్డాడు. చెప్పులు తుడవడం ఏం టాస్కని, రేపు మీరు విప్పేసిన చెడ్డీలు  కూడా ఉతకమంటారా? అని మహేశ్ విట్టా నిలదీశాడు.
big boss
star maa
punarnavi
maheshi vitta

More Telugu News